మళ్లీ తగ్గిన బంగారం ధరలు!

233
gold rate

బంగారం ధరలకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర తగ్గగా వెండికూడా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గి రూ.53,950గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70 తగ్గి రూ.49,450కు చేరింది.

బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 500 తగ్గి 69000వేలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గి 1965 డాలర్లుగా ఉండగా వెండి ధర ఔన్స్‌కు 0.56 శాతం తగ్గుదలతో 27.32 డాలర్లుగా ఉంది.