మంత్రి కేటీఆర్‌ని కలిసిన డీఎంకే ఎంపీ

114
minister
- Advertisement -

నీట్ పరీక్ష రద్దు అంశంపై టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్‌ని కలిశారు డీఎంకే ఎంపీ ఎలెన్గోవన్. అనంతరం మాట్లాడిన ఆయన..నీటి పరీక్ష రద్దు అంశం పై కేటీఆర్ ను కలిశామన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నీటి పరీక్ష అంశం పై మేము నిర్ణయం తీసుకున్నామన్నారు.

కేంద్ర విధానంపై మేము నిరసన చేస్తున్నామని… మాకు సపోర్ట్ చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆడిగామన్నారు. కేంద్రం కీలకమైన విషయాలలో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదన్నారు.

డీఎంకే ఎంపీలు కేటీఆర్‌ని కలిశారని…లెటర్ తీసుకొచ్చి కేటీఆర్ కి స్వయంగా అందించి సపోర్ట్ అడిగారని తెలిపారు. నీట్ పరీక్ష రద్దు అంశం పై ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కేసీఆర్ కు లేఖ రాశారని తెలిపారు.

- Advertisement -