రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇప్పటికే పాటల రచయిత చంద్రబోస్ రాసిన, ఎంఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటుకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు కైవసం చేసుకుంది. తాజాగా మరో విభాగంలో ఆర్ఆర్ఆర్ చోటు దక్కించుకుంది.
ఇప్పటివరకు 23 విభాగాలకు ఆస్కార్ అవార్డు ఇస్తుండగా తాజాగా మరో కేటగిరిని చేర్చారు. స్టంట్ డిజైన్ క్యాటగిరీని ప్రకటించగా ఇందులో హాలీవుడ్ చిత్రాలు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్, టామ్ క్రూయిస్ మిషన్ ఇంపాజిబుల్ స్టంట్స్ పోస్టర్స్‌తోపాటు ట్రిపుల్ ఆర్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టంట్ ఫొటోతో కలిపి ప్రకటించారు. దీన్ని చూసిన చరణ్ ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు.
దీనిపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. చివరికి!!100 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని ట్వీట్ చేశారు. ఈ చారిత్రాత్మక గుర్తింపును సాధ్యం చేసిన డేవిడ్ లీచ్, క్రిస్ ఓ’హారా మరియు స్టంట్ కమ్యూనిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు, అలాగే స్టంట్ పనితన శక్తిని గౌరవించిన @TheAcademy, CEO బిల్ క్రామర్, మరియు ప్రెసిడెంట్ జానెట్ యాంగ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ఆర్ఆర్ఆర్‌కి చోటు దక్కడం ఆనందంగా ఉందని వెల్లడించారు.
At last!!
After a 100 year wait !!!
Ecstatic for the new Oscars stunt design category for the films releasing in 2027! Huge thanks to David Leitch, Chris O’Hara, and the stunt community for making this historic recognition possible, and to @TheAcademy, CEO Bill Kramer, and… https://t.co/QWrUjuYU2I— rajamouli ss (@ssrajamouli) April 11, 2025
Also Read:నయీం కేసులో ఈడీ దూకుడు..

