వీడియో..నదిలో కుప్పకూలిన హెలికాప్టర్

12
- Advertisement -

అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో, ఆయన కుటుంబం దుర్మరణం పాలైంది. జర్మనీకి చెందిన టెక్నాలజీ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి, సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తూ ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ తలకిందులుగా నదిలో కుప్పకూలింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురూ మృతి చెందారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ బెల్ 206 చాపర్‌ను న్యూయార్క్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది.

Also Read:సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే

- Advertisement -