ఆలు గడ్డ కర్రీనే కాదు చిప్స్ కూడా అందరికి నచ్చుతాయి. ముఖ్యంగా ఆలుగడ్డలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో రక్తం ప్రసరణ సరిగా జరుగుతోంది. ఆలుగడ్డ జ్యూస్ తాగడం వల్ల కళ్ల కింద వచ్చే నల్లని మచ్చలు తొలగిపోతాయి. ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఆలుగడ్డల్లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. కనుక ఇవి మనకు శక్తిని అందిస్తాయి. ఒక మీడియం సైజు ఆలుగడ్డలో సుమారుగా 26 గ్రాముల మేర పిండి పదార్థాలు ఉంటాయి. ఇది శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. కానీ అధికంగా తింటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
ఆలుగడ్డలను ఎప్పుడూ ఉడకబెట్టి మాత్రమే తినాలి. వేయించి లేదా పచ్చిగా తినకూడదు. ఎందుకంటే సరిగ్గా జీర్ణం కావు. 150 గ్రాముల మేర ఆలుగడ్డలను తింటే 27 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. మనకు రోజుకు కావల్సిన విటమిన్ సి లో ఇది 45 శాతం. అలాగే 630 మిల్లీగ్రాముల మేర పొటాషియం, 0.2 మిల్లీగ్రాముల విటమిన్ బి6, స్వల్ప మోతాదులో థయామిన్, రైబోఫ్లేవిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నిషియం, ఐరన్, జింక్ తదితర పోషకాలు వీటి ద్వారా లభిస్తాయి.
Also Read:అణగారిన వర్గాల ఆశాజ్యోతి..ఫూలే
ఆలుగడ్డల్లో కార్టినాయిడ్స్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఆలుగడ్డల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.

