మారుతి…పక్కా కమర్షియల్

46
maruthi

టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి. మొదట్లో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన మారుతి, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

రీసెంట్‌గా ప్రతీరోజు పండగేతో హిట్ కొట్టిన మారుతి… వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. హీరో గోపిచంద్‌తో పక్కా కమర్షియల్ అనే మూవీని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు మారుతి.

వాస్తవానికి తొలుత రవితేజతో ఈ సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు మారుతి. అయితే రెమ్యునరేషన్స్‌ విషయంలో క్లారిటీ లేకపోవడంతో రవితేజ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడట. దీంతో గోపిచంద్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.