రహానేపై విరాట్ ప్రశంసలు

57
rahane

మెల్ బోర్న్ వేదికగా భారత్ – ఆసీస్‌ మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో తొలిరోజు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత్‌. ముఖ్యంగా భారత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆసీస్‌ 195 పరుగుల తక్కువ స్కోరుకే ఆలౌటైంది.

ఈ నేపధ్యంలో రహానే కెప్టెన్సీ,భారత ఆటగాళ్ల ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు విరాట్. తొలి రోజు బౌలర్లు గొప్పగా రాణించారు. అద్భుతమైన ముగింపు కూడా అని ప్రశంసలు కురిపించాడు.

అనుష్క శర్మ తొలి సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో కోహ్లి పితృత్వ సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో అజింక్య రహానే తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.