ప్రభాస్…సలార్ అప్‌డేట్

54
prabhas

కరోనా లాక్ డౌన్ తర్వాత వరుస సినిమాలతో అలరించేందుకు సిద్దమవుతున్నాడు హీరో ప్రభాస్. ప్రస్తుతం రాధేశ్యామ్,ఆది పురుష్ చిత్రాలను చేస్తున్న ప్రభాస్…వీటితో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స‌లార్ టైటిల్‌ని ఖరారు చేయగా తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది.

టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… జనవరి 18 నుండి ‘సలార్‌’ షూటింగ్‌లో ప్రభాస్‌ పాల్గొనబోతున్నాడట. నాలుగు నెలల పాటు కంటిన్యూగా ఈ సినిమా కోసం ప్రభాస్‌ వర్క్‌ చేయనున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

ఈ సినిమా తర్వాత ఓంరావుత్‌ దర్శతక్వంలో చేయనున్న ‘ఆదిపురుష్‌’, తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు ప్రభాస్.