‘రాజా సాబ్’ తో మారుతి ఫేట్ మారుతుందా?

20
- Advertisement -

వినోదాత్మక సినిమాలతో యంగ్ డైరెక్టర్ మారుతి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో బస్ స్టాప్, ఈ రోజుల్లో వంటి సినిమాలతో యూత్ కు దగ్గరైన మారుతి ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ప్రతిరోజూ పండగే, శైలజ రెడ్డి అల్లుడు వంటి చిత్రాలతో తానెంటో రుజువు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో మారుతి పేరు మారు మ్రోగడం ఖాయం. ప్రభాస్ ను మునుపెన్నడూ చూడని రాజాసాబ్ లో చూపించబోతున్నట్లు టాక్. ఈ మూవీని హర్రర్ జోనర్ లో మూవీ ఉండబోతున్నట్లు ఇప్పటికే లీక్స్ వస్తున్నాయి. దీంతో రాజాసాబ్ హైప్ మరింత పెరుగుతోంది. .

బాహుబలి తర్వాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్స్ తో చేసిన సాహో, రాధే శ్యామ్ వంటి చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో మారుతి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అయితే వినోదాత్మక చిత్రాలను కమర్షియల్ గా ప్రజెంట్ చేసే మారుతి.. ప్రభాస్ తో కూడా అదే తరహాలో తెరకెక్కిస్తుండడంతో ” రాజాసాబ్ ” హిట్ గ్యారెంటీ అని అభిమానులు నమ్ముతున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఆ మధ్య విడుదల అయిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజాసాబ్ మూవీనీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ రాజాసాబ్ హిట్ అయితే ప్రభాస్ కంటే మారుతి కే ఎక్కువ బెన్ ఫిట్ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రభాస్ తో మారుతి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read:పెళ్లిపుస్తకం తర్వాత లగ్గం : రాజేంద్రప్రసాద్

- Advertisement -