‘అజ్ఞాతవాసి’ కాపీ నిజమేనట..!

268
Director Jerome Salle Tweet on Agnyaathavaasi
- Advertisement -

భారీ అంచ‌నాల మ‌ధ్య హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో అజ్ఞాత‌వాసి చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుద‌లైంది. థియేట‌ర్స్ ద‌గ్గ‌ర ప‌వ‌న్ అభిమానుల సంద‌డి భారీగా క‌నిపిస్తుంది. ఓవ‌ర్సీస్‌లో గ‌త రాత్రి నుండే షోస్ ప్రారంభ‌మ‌య్యాయి. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే చిత్ర టీజ‌ర్ , ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత కొంద‌రు విశ్లేష‌కులు అజ్ఞాత‌వాసి చిత్రం లార్గోవించ్‌కి కాపీ అని అన్నారు. లార్గోవించ్ అనే సినిమా అదే పేరు కలిగిన హాస్య ప్రధాన నవల ఆధారంగా రూపొంద‌గా , ఒక కోటీశ్వరుడి రహస్య దత్తపుత్రుడు, తన తండ్రి హంతకులను కనుగొని శిక్షించడం కోసం అజ్ఞాతవాసం చేయడం ఈ సినిమా ఇతివృత్తం.

Director Jerome Salle Tweet on Agnyaathavaasi

అయితే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తన సినిమాకు కాపీయేనని ఫ్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సాలీ వ్యాఖ్యానించారు. గత రాత్రి లీ బ్రాడీలోని మెట్రో 4 థియేటర్ లో 7.45 గంటల షోను చూసిన ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తాను సినిమాను చూశానని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు.

ఈ సినిమా తనకు కూడా నచ్చిందని, అయితే, దురదృష్టవశాత్తూ ఈ సినిమా కథ, తన చిత్ర కథకు చాలా దగ్గరగా ఉందని చెప్పారు. కాగా, ఈ చిత్రం ‘లార్గో వించ్’ చిత్రానికి కాపీ అని గతంలోనే కత్తి మహేష్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథపై తమకు స్పష్టత ఇవ్వాలని ‘లార్గో వించ్’ భారత హక్కులను సొంతం చేసుకున్న టీ-సిరీస్ నుంచి ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలకు నోటీసులు కూడా అందాయి. ఇక జెరోమ్ సాలీ ట్వీట్ ను చూసిన వారు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

- Advertisement -