‘అజ్ఞాతవాసి’.. ఫ్లాప్‌ అన్న కత్తి..

217
- Advertisement -

ఈ రోజు భారీ అంచ‌నాలు మ‌ధ్య పవన్‌ సినిమా `అజ్ఞాత‌వాసి` విడుదలైంది. సాధార‌ణంగా ప‌వ‌న్ సినిమా అంటేనే ఓ క్రేజ్ ఉంటుంది. మ‌రి ప‌వ‌న్‌కు త్రివిక్ర‌మ్ తోడైతే ఎలా ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు పెద్ద విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్నాయి. పవన్‌పై కత్తి మహేష్‌ గత కొంత కాలంగా వివాదాస్పద కామెంట్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటి వరకు `అజ్ఞాత‌వాసి`పై పాజిటీవ్‌గానే రివ్యూలు వస్తున్నాయి. కానీ ఫిలిమ్‌ క్రిటిక్‌ కత్తి మహేష్‌ తన రివ్యూను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. సీరియస్ గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని మషేష్ అన్నారు. సినిమాను అపహాస్యం చేసిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్యంత దారుణమైన సినిమా ఇది అంటూ విమర్శించారు. ‘రిస్క్ చేసి చూస్తే… టైమేమో…’ (ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్ లో ఉంది) అంటూ కామెంట్ చేశారు.

- Advertisement -