Anu Emmanuel:’జపాన్’ లో సర్‌ప్రైజ్ రోల్

42
- Advertisement -

హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ ‘దీపావళి’ కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ విలేకరుల సమావేశంలో జపాన్ విశేషాలని పంచుకున్నారు

దర్శకుడు రాజు మురుగన్ జపాన్ కథ చెప్పినపుడు మీకు ఎక్సయిటింగా అనిపించిన అంశాలు ఏమిటి ?
రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్ గా వుంటుంది. కార్తి గారు, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, డీవోపీ రవి వర్మన్, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్.. ఇలా జపాన్ టీం చాలా పెద్దది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ఆడియన్ గా కూడా చాలా ఆసక్తి చూపిస్తాను.

కార్తి గారితో నటించడం ఎలా అనిపించింది ?
కార్తి గారు అద్భుతమైన నటుడు. తను టీం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆఫ్ స్క్రీన్ కార్తి గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇది కార్తి గారికి 25వ చిత్రం. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆయన చాలా కేర్ తీసుకుంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. కార్తి గారు గ్రేట్ కో స్టార్.

‘జపాన్’ లో ప్రేక్షకులని అలరించే యూనిక్ ఎలిమెంట్స్ ఏమిటి ?
ట్రైలర్ టీజర్ చూస్తూనే జపాన్ ఒక యూనిక్ సినిమా అని అర్ధమైపోతుంది. జపాన్ చాలా డిఫరెంట్ మూవీ. కార్తి గారే కాదు ఇలాంటి పాత్రని గతంలో ఎవరూ చేయలేదు. జపాన్ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడాలి. జపాన్ చాలా క్రేజీగా వుంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు.

‘జపాన్’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
‘జపాన్’ లో నా పాత్ర ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా వుంటుంది. దాని గురించి ఇప్పుడే ఎక్కువగా రివిల్ చేయకూడదు. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా వుంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ వుంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది.

జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ గురించి ?
జపాన్ నేపధ్య సంగీతం అద్భుతంగా వుంటుంది. థియేటర్ లో గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. పాటలు కూడా చాలా యూనిక్ గా వుంటాయి. కథకు తగ్గట్టే మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా వుంటుంది.

Also Read:కాంగ్రెస్ లో మంట.. చీలిక ఖాయమేనా?

ఎస్ఆర్ ప్రభు గారి నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ?
ఎస్ఆర్ ప్రభు గారు సినిమాపట్ల చాలా ప్యాషన్ వున్న ప్రొడ్యూసర్. జపాన్ కోసం బెస్ట్ టీం ఇచ్చారు. కార్తి, రాజమురన్, రవి వర్మన్, జీవీ.. ఇలా అద్భుతమైన టీంతో పని చేశాం. కేరళ, కాశ్మీర్, చెన్నై.. ఇలా చాలా అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశాం. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. అలాగే చెన్నై, హైదరాబాద్, కేరళ, దుబాయ్ ఇలా అన్ని చోట్ల అద్భుతంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్స్ లో ప్రభు గారు ఒకరు.

ఇందులో సునీల్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా ?
జపాన్ లో సునీల్ గారితో సీన్స్ వున్నాయి. సునీల్ గారు నా ఫేవరెట్ యాక్టర్. సునీల్ గారితో ఇంతకుముందు ఊర్వశివో రాక్షసివో సినిమా కోసం కలిసి పని చేశాను. తను చాలా వైవిధ్యమైన నటుడు. పుష్పలో అద్భుతమైన పాత్ర చేశారు. జపాన్ లో కూడా ఆయన పాత్ర చాలా బావుంటుంది.

మీరు ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటారు ?
నాకు డ్రీం రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని వుంటుంది. అలాంటి మంచి పాత్రలు, కథలు రావాలని కోరుకుంటాను.

Also Read:KCR:కాంగ్రెస్,బీజేపీకి డిపాజిట్లు రావొద్దు

- Advertisement -