అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టింది పసికూన అఫ్గానిస్తాన్. బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ(71 పరుగుల)తో విజయ్ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 20 ఓవర్లలో 105 పరుగులు చేసింది.
కోహ్లి గైర్హాజరీలో అజింక్యా రహానే ఇండియాకి కెప్టెన్సీ వహిస్తుండగా, చాన్నాళ్ళ తర్వాత దినేష్ కార్తీక్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫిటెనెస్ టెస్టుతో విఫలమైన షమీ ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు టీ20,వన్డేల్లో అద్భుతాలు సాధిస్తున్న ఆఫ్ఘనిస్తాన్..భారత్‌కు ఏ రకమైన పోటీ ఇస్తుందా అని క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో సంచనలం సృష్టించి విజయం అందిస్తాడని ఆఫ్ఘన్ టీం భారీ ఆశలు పెట్టుకుంది.
జట్ల వివరాలు:
భారత్: శిఖర్ ధావన్, మురళీ విజయ్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (కెప్టెన్), లోకేష్ రాహుల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్
ఆఫ్ఘనిస్థాన్: మహమ్మద్ షెహజాద్, జావెద్ అహ్మది, రహ్మత్ షా, అజ్గర్ స్టానిక్ జై (కెప్టెన్), అఫ్జర్ జజై (వికెట్ కీపర్), మహమ్మద్ నబీ, హష్మతుల్లా షాహిది, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, యామిన్ అహ్మద్ జై, వఫాదార్