పాతబస్తీలో పర్యటించిన డీజీపీ మహేందర్ రెడ్డి..

144
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నగర కమిషనర్ అంజనీకుమార్ ఆధ్వర్యంలో హైదరాబాదులో లాక్ డౌన్ కర్ఫ్యూ బందోబస్తు కొనసాగుతుంది. కర్ఫ్యూలో భాగంగా పాతబస్తీ ప్రజలు పోలీసులకి ఎంతో సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు పాతబస్తీలో కర్ఫ్యూ ఏవిధంగా ఉందో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. కాంచన్ బాగ్,సంతోష్ నగర్,సైదాబాద్,చంచల్ గూడ,దాబీర్ పురలో డీజీపీ పర్యటించారు.

ఈ సంద‌ర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు. అన‌వ‌స‌రంగా రోడ్ల మీద‌కు రావొద్దు అని ప్ర‌జ‌ల‌కు డీజీపీ విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌లంద‌రూ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. లాక్‌డౌన్ వేళ‌ల్లో బ‌య‌ట‌కు వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేసి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ రాష్ర్టంలో చిన్న ప‌ట్ట‌ణాల నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు లాక్‌డౌన్ స‌మ‌ర్థ‌వంతంగా కొన‌సాగుతోంద‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

- Advertisement -