త‌మ‌న్నా వదిలిన ‘క్యాబ్‌స్టోరీస్’ ట్రైల‌ర్‌..

49

బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి వైద్య, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్యాబ్‌ స్టోరీస్‌’. కేవీఎన్‌ రాజేష్‌ దర్శకత్వంలో ఇమేజ్‌స్పార్క్‌ ప్రొడక్షన్ ప‌తాకంపై ఎస్‌. కృష్ణ నిర్మించారు. స్పార్క్ ఓటీటీలో క్యాబ్‌స్టోరీస్‌ ఈ నెల 28న స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లవ్‌ రింగ్‌టోన్‌ లిరికల్‌ వీడియోకు మంచి స్పందన లభిస్తుంది. తాజాగా ‘క్యాబ్‌ స్టోరీస్‌’ ట్రైలర్‌ను మిల్కీబ్యూటీ తమన్నా విడుదల చేసి, చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

‘తెలియక తప్పు చేస్తే తప్పా..,లేదు… తెలుసుకుని సారీ చెప్తే తప్పా..కాదే, అయితే ఈ రెండు నేను చేశానంటే నేను కరెక్టే కదా’, ‘ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత అనేది డిసైడై పది నిమిషాల్లో కాల్‌ చేస్తా..’, ‘షాలిని..యువార్‌ ద బెస్ట్‌ గాళ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’, ‘అమ్మాయిలందరూ మీలా ఆలోచిస్తే ఆసలు ప్రాబ్లమ్సే రావు మేడమ్‌..ఇంతకీ ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే…’, ‘ఓవర్‌ ఎగై్జట్‌మెంట్, ఓవర్‌ థింకింగ్‌ ..ఈ రెండూ రిలేషన్‌కే కాదు..ఆరోగ్యానికి కూడా హానికరం’, అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్‌ ‘క్యాబ్‌ స్టోరీస్‌’పై మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్నాయి. అవుట్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘క్యాబ్‌స్టోరీస్‌’ కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయని, ఊహించిని మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని చిత్రయూనిట్‌ చెబుతుంది.

తారాగాణం: దివి వైద్య, గిరిధర్, ధన్‌ రాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి
సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: కేవీఎన్‌ రాజేష్, నిర్మాత: ఎస్‌ కృష్ణ, డీఓపీ: సుజాత సిద్దార్థ్, సంగీతం: సాయి కార్తీక్, ఎడిటర్‌: తమ్మిరాజు.

Cab Stories | Official Trailer | Spark World | Divi | Shrihan | Dhanraj | Giridhar |Premieres May 28