కొత్త రెవెన్యూ చట్టం…సర్వత్రా హర్షం

188
devi prasad
- Advertisement -

భారతదేశంలోనే మెరుగైన పారదర్శకమైన అద్భుతమైన రెవెన్యూ చట్టం ఈరోజు శాసనసభలో ఆమోదించడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ వ్యవస్థల పట్ల విశ్వాసం కలిగించే విధంగా సేవలు కలిగిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రకటించడం పట్ల స్వాగతిస్తున్నాం అని తెలిపారు తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ మాజీ ఛైర్మన్ దేవీ ప్రసాద్.

చాలా కాలంగా వెట్టిచాకిరి చేస్తున్న రెవెన్యూ అసిస్టెంట్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడానికి నిర్ణయించడం మరియు పట్టణ ప్రాంతంలో స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి పాస్ బుక్కులు అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయించడం చారిత్రాత్మకం. రాష్ట్రంలో ఉన్న భూములన్నీ సర్వే చేసి సరి హద్దులు నిర్ణయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రకటించడం హర్షనీయం అన్నారు.

అలాగే గతంలో వివాదాల పేర రైతుల ఇబ్బందులు పెట్టె రెవెన్యూ అధికారాలను రద్దు చేయడం ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. చట్టం ప్రకారం పనిచేయని అవినీతి ఉద్యోగులను భర్తరఫ్ చేస్తామని చట్టంలో పొందుపరచడం వలన ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేసే అవకాశం ఉంది . రెవెన్యూ ఉద్యోగులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి నూతన చట్టాన్ని ప్రజలకు వివరించి సేవలందించే మహత్తర అవకాశానికి నాంది పలకాలని కోరుతున్నాం అని తెలిపారు.

- Advertisement -