తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జిగా ఎంపీ మాణికం ఠాకూర్..

449
manikam

కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనలో భాగంగా కొత్త సీడ్యబ్లూసీ కమిటీని ప్రకటించిన పార్టీ అధిష్టానం పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జీలను నియమించింది. ఇప్పటివరకు తెలంగాణ ఇంఛార్జీగా ఉన్న కుంతియా స్దానంలో ఎంపీ మాణికం ఠాకూర్‌ని నియమించింది.

తమిళనాడు విరుధానగర్ పార్లమెంట్ సభ్యులు మాణికం ఠాకూర్ ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచార్జిగా నియామకం చేశారు. వివిధ రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ లుగా వ్యవహరించిన గులామ్ నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, లుజిన్యో ఫెలీరియోలను కూడా తొలగించారు.

వీరిలానే వివిధ రాష్ట్రాల పార్టీ ఇంచార్జ్ లుగా వ్యవహరించిన అనుగ్రహ్ నారాయణ సింగ్, ఆశా కుమారి, గౌరవ్ గొగయ్, రామ చంద్ర కుంతియా లను తొలగించింది పార్టీ అధిష్ఠానం.