బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 6 హైలైట్స్!

320
bigg boss

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 4 విజయవంతంగా 6 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. 6వ ఎపిసోడ్‌లో భాగంగా కట్టప్ప కోసం కంటెస్టెంట్‌ల అన్వేషణ కొనసాగగా టమోట రసం కోసం సభ్యులు చేసిన హంగామా,గంగవ్వ జిమ్ వర్కౌట్స్‌తో ఆధ్యంతం ఆసక్తిగా సాగింది.

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా లాస్య, నోయల్, దివిలు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. ఇక బిగ్ బాస్ జిమ్‌లో వర్కౌట్స్‌ చేసి అందరిలో ఉత్సాహం నింపింది గంగవ్వ. సొహైల్, మెహబూబ్‌లతో పోటీ పడుతూ బెలూన్‌తో వర్కౌట్ చేసింది. వయసుకు మించి గంగవ్వ చేసిన వర్కౌట్స్‌కి అంతా ఫిదా అయిపోయారు.

ఇక కిచెన్‌లోకి వెళ్లిన మొనాల్ గజ్జర్.. తాను ఎగ్స్ తిననని ఎగ్స్ తిని ఎక్కడబడితే అక్కడ పెట్టొద్దని ఆర్డర్లు వేయడంతో రాజశేఖర్ మాస్టర్ అసహనం వ్యక్తం చేశారు. తనకు ఆర్డర్లు వేసి, కండిషన్స్ పెడితే నచ్చదని అందరకీ కళ్యాణి తెగ బాధపడింది.

ఇక చివరగా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కట్టప్ప ఎవరో మీరే తేల్చుకోవాలని ఇంటి సభ్యులకు సూచించగా ఒక్కొక్కరు వెళ్లి తాము ఎవరిని కట్టప్ప అనుకుంటున్నామో వారి మొహం మీద స్టాంపు వేశారు. మెజార్టీ సభ్యులు అమ్మ రాజశేఖర్, నోయల్, లాస్యల్లో ఎవరో ఒకరు కట్టప్ప అయ్యి ఉంటారని భావిస్తూ వాళ్ల ముఖంపై స్టాంప్ కొట్టారు.

ఇక నోయల్ వంతురాగా వేరే వాళ్ల ముఖంపై కొడితే ఫీల్ అవుతారని అందుకే తనకు తానే కట్టప్పనని చెప్పి స్టాంపు వేసుకోగా సభ్యులు అభ్యంతరం తెలిపింది. కట్టప్ప ఎవరనేది బిగ్ బాస్ డిసైడ్ చేస్తారని నోయల్‌తో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దదిగా మారుతుండగా కల్పించుకున్న బిగ్ బాస్…కట్టప్ప ఎవరనేది తాను డిసైడ్ చేస్తానని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. చివరగా రాజశేఖర్ మాస్టర్ ఇంటి సభ్యుల్లో గ్రూప్‌లు మొదలయ్యాయని చెప్పడంతో ఎపిసోడ్ ముగిసింది.