జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఆరోగ్యశాఖ మంత్రి..!

159
Delhi Health Minister

ఢిల్లీలో కరోనా వైరస్ వీరంగం సృష్టిస్తోంది. రోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడం అక్కడి ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అస్వస్థతకు గురికావడంతో ఆయనకు కరోనా సోకిందేమోనన్న అనుమానాలు తలెత్తాయి.

దీంతో ఉయనకు కరోనా పరీక్షలు చేయగా రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. దీంతో ఢిల్లీ అధికార యంత్రం ఊపిరిపీల్చుకుంది. నిన్న రాత్రి మంత్రి సత్యంద్ర జైన్ జ్వరం, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషలిటి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.