నేడు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు..

359
Rains in telangana
- Advertisement -

పశ్చిమ మధ్యప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి.తూర్పు విదర్భ మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా జూన్ 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా చోట్ల మరియు రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కోమరంభీం, నిర్మల్ మరియు మంచిర్యాల జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -