గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు..

118
green

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ముందుకు సాగుతోంది. న్యూఢిల్లీలోని గోల్డ్ మార్కెట్ లో ఉన్న బీజేపీ పార్టీ ఆఫీస్‌లో ఢిల్లీ ప్రదేశ్ బీజేపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు మూడు మొక్కలను నాటారు.

రాజ్యసభ సభ్యులు సంతోష్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్పదని…. ప్రతీ ఒక్కరం మూడు మొక్కలు నాటి పచ్చని భారతావనినీ మనమే నిర్మించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.