గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన కలెక్టర్ జి. రవి …

112
warangal giv

తెలంగాణకు హరితహారం కార్యక్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపెల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బాగంగా ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటడంతో పాటు వారు మరో ముగ్గరి పేర్లను ప్రతిపాధిస్తూ వారుకూడా మూడు మొక్కలను నాటేవిధంగా గ్రీన్ చాలెంజ్ ను ఇవ్వాలనె సదుద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డా. ఏ. శరత్ గారు స్వీకరించి జిల్లా కలెక్టర్ జి. రవి పేరును ప్రతిపాదించారు.

చాలెంజ్ ను స్వీకరించిన జిల్లా కలెక్టర్ గురువారం క్యాంపు కార్యాలయంలో బాదం మొక్కలను నాటి వాటి సంరక్షణ బాద్యతలను చేపట్టడంతోపాటు జగిత్యాల అడిషనల్ ఎస్పి దక్షిణామూర్తి, అడిషనల్ కలెక్టర్ బి. రాజేషం మరియు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడిస్ శ్రీమతి అరుణశ్రీ గార్లకు ప్రతిపాదిస్తు వారు ముగ్గురు మూడు మొక్కలను నాటడంతో పాటు, మరో ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని అన్నారు.

హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారంచుట్టిన రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపెల్లి సంతోష్ కుమార్ గారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.జిల్లా పౌర సంబందాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయడమైంది.