పంజాబ్‌పై డీసీ గెలుపు…

29
dhawan

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ ఆరో విజయాన్ని నమోదుచేసుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.పంజాబ్ విధించిన 167 పరుగుల లక్ష్యాన్ని 17. ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది.

శిఖర్‌ ధావన్‌ (47 బంతుల్లో 69 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో హాఫ్ సెంచరీ చేయగా పృథ్వీ షా (22 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా జట్టుకు మరోసారి శుభారంభం చేశారు. దీంతో సునాయసంగా విజయం సాధించింది ఢిల్లీ.

తొలుత పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మయాంక్‌ అగర్వాల్‌ (58 బంతుల్లో 99 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు.