తండ్రితో తన్నులు తిన్న శిఖ‌ర్ ధావ‌న్..!

158
- Advertisement -

ఐపీఎల్ 2022 లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టిన తెలిసిందే. టీమిండియా సీనియర్‌ ప్లేయర్‌ శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడు. ఐపీఎల్ ఈ సీజ‌న్‌లో ధావ‌న్ దుమ్ములేపాడు. కానీ పంజాబ్ టీం మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేదు. శిఖ‌ర్ ధావ‌న్ 38.3 స‌గ‌టుతో 14 మ్యాచుల్లో పంజాబ్ త‌ర‌పున‌ 460 ర‌న్స్ చేశాడు. అయితే ఆ జ‌ట్టు నాకౌట్ ద‌శ‌కు చేర‌క‌పోవ‌డంతో ధావ‌న్ తండ్రి కోపంతో ఊగిపోయాడు. ధావ‌న్ త‌న ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ధావ‌న్‌ను ఆయన తండ్రి కింద పడేసి కొడుతున్న‌ట్లుగా కనిపిస్తోంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్లు ధావ‌న్ తండ్రిని అడ్డుకుంటున్న‌ట్లు ఆ వీడియోలో చూపించారు. అయితే ఎప్పుడు స‌ర‌దా వీడియోలు పోస్టు చేసే ధావ‌న్ ఈసారి కూడా ఇలా త‌న అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. త‌మ జ‌ట్టు నాకౌట్ ద‌శ‌కు క్వాలిఫై కాలేద‌ని త‌మ తండ్రి ఇలా కొడుతున్నార‌ని త‌న వీడియోకు ధావ‌న్ ఓ ట్యాగ్ పోస్టు చేశాడు. స‌ర‌ద‌గా సాగిన ఆ వీడియోకు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.

- Advertisement -