టీ20 కెప్టెన్‌గా హార్ధిక్

304
ind
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ ముగియగానే భారత జట్టు న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంపికచేసింది బీసీసీఐ. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుండగా వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. వన్డే జట్టుకు శిఖర్ ధావన్ ,టీ20 జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రెండు సిరీస్‌లకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నారు.

ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మతోపాటు, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి ఈ టోర్నీకి విశ్రాంతినిచ్చింది. దినేష్ కార్తీక్‌కు చోటు దక్కలేదు. కుల్‌దీప్ సేన్‌ను వన్డే జట్టు కోసం మొదటిసారిగా జాతీయ జట్టుకు ఎంపికకాగా ఉమ్రాన్ మాలిక్‌కు సైతం చోటు దక్కింది.

వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైసె కెప్టెన్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజు శామ్సన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, కుల్‌దీప్ సేన్‌, అర్ష్‌దీప్ సింగ్, షార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్

టీ20 జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైసె కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజు శామ్సన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

ఇవి కూడా చదవండి..

మోడీకి లక్ష పోస్టు కార్డులు..

తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి

బండికి అధిష్టానం అక్షింతలు..

- Advertisement -