సాగర్ ప్రజలకు ధన్యవాదాలు: ఎమ్మెల్సీ కవిత

17
kavitha mlc

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. టీఆర్ఎస్,సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల నమ్మకం ఉంచిన సాగర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అలాగే సాగర్‌లో నోముల భగత్‌ విజయం కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు కవిత.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ 18,872 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి, సీనియర్‌ నేత జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. 2018 ఎన్నికలతో పోలిస్తే దాదాపు మూడింతల అధిక మెజార్టీతో భగత్‌ గెలుపొందారు. భగత్‌ 89,804 ఓట్లు సాధించగా, జానారెడ్డి 70,392 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ రవినాయక్‌ కేవలం 7,676 ఓట్లతో సరిపెట్టుకొని డిపాజిట్‌ కోల్పోయారు.