ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..

11
delhi

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వెస్ట్ ఢిల్లీలోని మండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని మూడు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ లో మంటలు చెలరేగగా 26 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భవనంలో చిక్కుకుపోయిన దాదాపు 60-70 మందిని ప్రాణాలతో కాపాడారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.