దేశంలో 24 గంటల్లో 2858 కరోనా కేసులు…

11
India Coron Cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 2858 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,19,112కు చేరగా 4,25,76,815 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 18,096 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,24,201 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,91,15,90,370 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని వైద్యశాఖ వెల్లడించింది.