ఢిల్లీ అల్లర్లు…కేంద్రందే బాధ్యత:రజనీకాంత్

412
rajinikanth
- Advertisement -

మూడు రోజులుగా కొనసాగుతున్న హింసతో దేశ రాజధాని విధ్వంసమైంది. చాంద్‌బాగ్‌, జఫ్రాబాద్‌, భజన్‌పురా, యమునావిహార్‌, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో వీధులన్నీ విధ్వంసపు సాక్ష్యాలుగా మిగిలాయి. అల్లరిమూకలు స్వైరవిహారంతో ఇప్పటివరకు 27 మంది మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. భద్రతా బలగాలను భారీగా మోహరించడంతో ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది.

దేశరాజధానిలో జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుండగా తాజాగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సూపర్ స్టార్ రజనీకాంత్‌ . ఢిల్లీ అల్లర్లకు కేంద్ర హోంశాఖదే బాధ్యతని….హోంశాఖ, నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఢిల్లీలో ఘర్షణలు జరిగాయని రజనీ ఆరోపించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ.. ఇంటలిజెన్స్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందన్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకునే పార్టీలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -