మాట తప్పిన పూరీ జగన్నాథ్..

201
ismart Shankar

చెప్పిన టైమ్ కు సినిమా విడుదల చేసే దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మొదటి వరుసలో ఉన్నారు. చెప్పిన టైం కంటే ముందుగా సీనిమాను విడుదల చేసే ఘనత ఆయనకు ఉంది. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తో కేవలం 70రోజుల్లో సినిమాను తీశాడు పూరీ జగన్నాథ్. అయితే గత కొద్ద రోజులుగా ఆయన తీసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆయన కొంచెం లేటుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

సినిమా ప్రారంభించిన రోజే విడుదల తేదీని కూడా ఖరారు చేసే ఏకైక దర్శకుడిగా పూరీ కి పేరుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ప్రారంభమైనరోజే ఈమూవీ విడుదల తేదీని ప్రకటించారు దర్శకుడు పూరీ జగన్నాథ్. నిజానికి ఈసినిమాను మే 31న విడుదల చేస్తామని ప్రకటించారు.

కానీ షూటింగ్ కాస్త లేటవడంతో ఇంత వరకూ విడుదల తేదీని ప్రకటించలేదు. అసలు ఈసినిమా షూటింగ్ నుంచి అప్ డేట్స్ ఏమి బయటకు రావడం లేదు. ఇప్పటికీ ఒక్క పోస్టర్‌, టీజర్‌ కూడా వదల్లేదు. ఇంకా షూటింగ్‌ జరుగుతూనే ఉంది. చూస్తుంటే ఈ చిత్రం మేలో విడుదల కాదని తెలుస్తోంది. జూన్ లో ఈమూవీని విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.