డార్లింగ్‌కు గుడ్‌ బై చెప్పిన రాజమౌళి..

201

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి-2 నుంచి ప్రభాస్‌ తప్పుకున్నారు. డార్లింగ్‌కు బాహుబలి నుంచి విముక్తి లభించిందని…షూటింగ్ నుంచి ఇంటికి పంపించినట్లు ట్విట్టర్ ద్వారా రాజమౌళి తెలిపారు. అంతేకాదు మూడున్నరేళ్లు భరించిందుకు థాంక్స్‌ కూడా చెప్పాడు.

ఈ మూడున్నర సంవత్సరాల ప్రయాణం నరకం లాంటిందని….ప్రభాస్‌ చాలా కష్టపడ్డాడని తెలిపాడు. ఓ స్టార్ హీరో ఒకే సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు డేట్స్ ఇవ్వటం.. మరో మూవీ చేయకపోవటం అంటే సినిమా, అందులోని పాత్రలో ప్రభాస్ కు ఉన్న కమిట్ మెంట్ ను చెబుతుంది అంటున్నారు యూనిట్ సభ్యులు. పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకోవటంతో చాలా కష్టపడ్డాడు ప్రభాస్.

Prabhas is a free bird now

బాహుబలి కోసమే శారీరకంగా, మానసికంగా విపరీతమైన శ్రమ పడటంతో గ్యాప్ వచ్చిన సినిమాలు చేసేందుకు ప్రభాస్ ఆసక్తికనబరచలేదు. ఇప్పుడు బాహుబలి రెండో భాగం కూడా పూర్తవ్వటంతో ప్రభాస్ ఇక నార్మల్ లుక్లో కనిపించనున్నాడు. రేపటి నుంచి ప్రభాస్ సెట్స్ లో కనిపించరు అన్న విషయం తెలిసిన తర్వాత.. చివరి రోజు షూటింగ్ లో అంతా బాగా ఎమోషనల్ గా ఫీలయ్యారంట.

త్వరలోనే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించేందుకు అంగీకరించాడు.2015లో విడుదలైన ‘బాహుబలి’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు సాధించింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న ‘బాహుబలి- ది కంక్లూజన్‌’ ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.