బాహుబలి 2..ఎవర్‌గ్రీన్ మూవీ: ప్రభాస్

268
prabhas
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం బాహుబలి. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటించగా రానా కీ రోల్ పోషించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి ఇప్పటివరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది.

ఏప్రిల్ 28, 2017న విడుద‌లైన బాహుబ‌లి 2 చిత్రం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా తన మనసులోని మాటను చెప్పారు ప్రభాస్. నా జీవితంలో మరచిపోలేని,ఎవర్‌ గ్రీన్ చిత్రం బాహుబలి 2 అని పేర్కొన్నారు.

దేశం ప్రేమించిన సినిమానే కాదు నా జీవితంలో అతి పెద్ద చిత్రం బాహుబలి 2 అని పేర్కొన్నారు. డార్లింగ్ రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రభాస్. ది మైటీ, ది మెజిస్టీ.. ది మాహిష్మ‌తీ.. మీ ప్రేమ‌ల‌ని మిస్ అవుతున్నా అని పేర్కొన్నాడు రానా.

- Advertisement -