స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి:సీపీ సజ్జనార్

60
cp sajjanar

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. సైబరాబాద్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. పోలింగ్‌ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పకడ్బందీ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి సూచించారు.

సైబారబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎన్నికల నిర్వహనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.