నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు: సజ్జనార్

40
sajjanar

పోలీసుల అనుమతి లేకుండా ఎవరు రోడ్లపైకి రావొద్దని సూచించారు సీపీ సజ్జనార్. సైబరాబాద్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన లాక్ డౌన్ కారణంగా ఫార్మా, ఐటీ కంపెనీలో ఉత్పత్తికి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేశారు.

ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులు తప్పనిసరిగా ఐడీ కార్డు చూపెట్టాలన్నారు. పోలీసులు జారీ చేసే పాస్ లు ఉంటేనే డెలివరీ బాయ్స్‌కి అనుమతిస్తున్నామని… ఈ కామర్స్ టీ షర్ట్స్ వేసుకొని రోడ్డు మీదకి వస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నారు. అనుమతి లేకుండా రోడ్డు మీద వచ్చే డెలివరీ బాయ్స్ పైన చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

హైద‌రాబాద్‌లో మొత్తం 276 త‌నిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు పోలీసులు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 180 త‌నిఖీ కేంద్రాలు, సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 50, రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 46 త‌నిఖీ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. అన్ని ర‌హ‌దారుల‌పై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు.