జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్ల గెజిట్‌ విడుదల..

38
ghmc

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల పేర్లతో గెజిట్‌ విడుదలైంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల్లో గెలుపొందిన 150 మంది కార్పొరేటర్ల పేరుతో ఈ గెజిట్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. గెలుపొందిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందని ఆయన తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 4వ తేదీ వెలువడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నెలఖారులో మేయర్‌ ఎన్నిక తేదీ ఖరారు కానుంది. త్వరలోనే కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.