ఆర్‌సీబీపై సీఎస్‌కే గెలుపు

40
rcb

ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

సీఎస్‌కే ఓపెనర్స్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(38), డుప్లెసిస్‌ (31) రాణించగా మొయిన్‌ అలీ(23), అంబటి రాయుడు(32) ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 2, చహల్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకముందు ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లి(53, 41 బంతులు; 6 ఫోర్లు, 1 సిక్సర్‌), పడిక్కల్‌(70, 50 బంతులు; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించిన చివర్లో బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇక సీఎస్‌కే బౌలర్లలో బ్రావో 3, శార్దూల్‌ ఠాకూర్‌ 2, దీపక్‌ చహర్‌ 1 వికెట్‌ తీశాడు.