దేశంలో 24 గంటల్లో 29,616 కరోనా కేసులు

50

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 29,616 కరోనా కేసులు నమోదుకాగా 290 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది.

కరోనా నుండి ఇప్పటివరకు 3,28,76,319 మంది బాధితులు కోలుకోగా 4,46,658 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 3,01,442 కేసులు యాక్టివ్‌గా ఉండగా రికరీ రేటు 97.78 శాతానికి చేరింది. ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య శాఖ వెల్లడించింది.