IPL 2024:రేపటి నుంచే మెగా టోర్నీ!

60
- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నాయి. రేపటి నుంచి క్రికెట్ ఫీవర్ తో అభిమానులు ఉర్రూతలూగనున్నారు. మొదటి మ్యాచ్ ఆర్సీబీ vs సిఎస్కే మద్య చెపక్ స్టేడియంలో జరగనుంది. కప్పు వేటలో పది జట్లు పాల్గొననున్నాయి. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత సరైన క్రికెట్ మజాకు దూరమైన అభిమానులకు ఐపీఎల్ సరికొత్త వినోదాన్ని పంచనుంది. గత సీజన్ లతో పోల్చితే ఈసారి ఐపీఎల్ కొంత ప్రత్యేకమైనదే. ఎందుకంటే చాలా జట్లు మార్పులు చేర్పులు చేసి సరికొత్తగా బరిలోకి దిగబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్ తర్వాత ఆ స్థాయిలో జట్టును నడిపించిన కెప్టెన్ లేడనే చెప్పాలి. అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ తరుపున కెప్టెన్ గా పాట్ కమిన్స్ పగ్గాలు చేపట్టాడు. .

గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఆస్టేలియా సొంతం చేసుకోవడంలో కమిన్స్ కెప్టెన్సీ కీలకమైనది. అందుకే ఎస్ఆర్హెచ్ కమిన్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక సిఎస్కే విషయానికొస్తే ఈ సీజన్ ఐపీఎల్ లో తనది కొత్త పాత్ర అంటూ ధోని ఇప్పటికే చెప్పుకొచ్చాడు. దాంతో ధోని కొత్త పాత్ర కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అటు ఆర్సీబీ, డిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారైనా కప్పు ముద్దాడాలని పట్టుదలగా ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు, హర్ధిక్ పాండ్యా రోహిత్ కారణంగా కొంత విమర్శలు ఎదుర్కొంటున్నాయి. గత రెండేళ్లు హర్ధిక్ కెప్టెన్సీలో ఉన్న గుజరాత్ ఈసారి యువ సంచలనం గిల్ సారథ్యంలో నడవనుంది. ఇక ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ.. ఈసారి కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. ఇక లక్నో, కోల్ కతా జట్లు కూడా ఈసారి కప్పు సాధించాలని పట్టుదలగా ఉన్నాయి. ఇలా ప్రతి జట్టు కూడా అడపా దడపా మార్పులతో సరికొత్తగా బరిలోకి దిగబోతున్నాయి. మరి ఈ 17 సీజన్ టైటిల్ ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

Also Read:రాగిపాత్రలతో ఆరోగ్యం..

- Advertisement -