జీ5 ఓటీటీలో రాజ రాజ చోర..

52
raja raja chora

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం. యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై సూపర్ టాక్ అందుకుంది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్థమైంది. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగ‌గా హిలేరియ‌స్ పాత్రలో క‌నిపించ‌గా మేఘా ఆకాశ్ మెయిన్ హీరోయిన్‌గా న‌టించింది.

వేద రామ‌న్ సినిమాటోగ్రఫీ అందించగా ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందించారు. తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్,ఛాయాగ్రహణం: వేదరామన్,సంగీతం: వివేక్ సాగర్,ఎడిటింగ్: విప్లవ్ నైషధం,ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి,సహ నిర్మాత: వివేక్ కూచి భొట్ల,నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్,రచన-దర్శకత్వం: హసిత్ గోలి.