రాష్ట్ర సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు కరోనా..

23
cs

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్‌ సోకినట్లు సీఎస్‌ స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం అందలేదు. అయితే ఇటీవల తనను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణలు కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సోమేశ్‌కుమార్‌ సూచించారు.

మంగళవారం ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సోమవారం సీఎం కేసీఆర్‌తో కూడా సోమేష్‌కుమార్‌ సమావేశమయ్యారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ప్రతీ రోజు సీఎంతో సోమేష్‌కుమార్‌ సమీక్షల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార వర్గాల్లో ఆందోళన మొదలైంది.