త్వరితగతిన ఆర్ధిక సాయం..అధికారులకు సీఎస్ ఆదేశం

306
somesh kumar
- Advertisement -

ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు నగరంలో వరద ప్రభావిత కుటుంబాలకు త్వరితగతిన ఆర్ధిక సహాయం అందేలా ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం బిఆర్ కెఆర్ భవన్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో ఆర్ధిక సహాయం పంపిణీ పై సమీక్షించారు.

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలో 300 బృందాలను, పరిసర మున్సిపాలిటీల పరిదిలో మరో 50 బృందాలను ఏర్పాటు చేసి బాధితులకు ఎటువంటి జాప్యం లేకుండా ఇంటివద్దే ఆర్ధిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిహెచ్ఎంసి పరిదిలో ఒక కంట్రోల్ రూం, అదేవిధంగా సిడిఎంఎ కార్యాలయంలో మరో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసి వరద సహాయ పంపిణీని పర్యవేక్షించాలని అన్నారు.

అధికారులు రూట్ ప్లాన్ ను సిద్ధం చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించాలని, జిల్లాల నుండి అవసరమైన మేరకు సిబ్భందిని సమకూర్చుకోవాలని అన్నారు. నగరంలోని ప్రతి సర్కిల్ కు పది బృందాలు చొప్పున, ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులు ఉండేవిధంగా చూసుకొని ఆర్ధిక సహాయాన్ని పంపిణి చేయాలని అన్నారు. ప్రతి సర్కిల్ లో రూట్ ఆఫీసర్ ను నియమించి బృందాలకి అవసరమైన నిధులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సెలవులలో కూడా నిధుల పంపిణీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా high denomination కరెన్సీని తగు మొత్తంలో అందుబాటులో ఉంచాలని ఎస్ఎల్ బిసి కన్వీనర్ ను కోరినట్లు సి.యస్ తెలిపారు.

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్,ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి  శ్రీ కె.రామకృష్ణారావు, ఎస్.సి సంక్షేమ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, జిహెచ్ఎంసి కమీషనర్  శ్రీ లోకేశ్ కుమార్, సిడిఎంఎ శ్రీ సత్యనారాయణ, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ శ్రీమతి స్వేతా మహంతి, రంగారెడ్డి కలెక్టర్ శ్రీ అమయ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -