అజయ్‌ మిశ్రా సహకారం మరువలేనిది: ప్రభాకర్ రావు

132
cmd prabhakarrao

తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన విజయాలలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజయ్ మిశ్రా సహకారం ఎంతో ఉందని ట్రాన్స్ కో, జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. ప్రభుత్వానికి, విద్యుత్ సమస్యలకు మధ్య వారధిగా ఉండి ఎంతో సహనం, సమన్వయం, సమయ స్ఫూర్తితో బాధ్యతలు నెరవేరచారని అభినందించారు.

పదవీ విరమణ చేసిన అజయ్ మిశ్రాకు ట్రాన్స్ కో, జెన్ కో, ఎన్ పిడిసిఎల్, ఎస్ పిడిసిఎల్ ఆధ్యవర్యంలో విద్యుత్ సౌధలో ఘనంగా విడ్కోలు పలికారు. ఈ సందర్భంగా దేవులపల్లి ప్రభాకర్ రావు మాట్లాడుతూ అజయ్ మిశ్రా ఇంధన శాఖ బాధ్యతలు నెరవరుస్తున్న సందర్భాల్లో విద్యుత్ సంస్థల సాదక బాదకాలనను సంపూర్ణంగా అర్థం చేసుకొని సహకరించారన్నారు.

విద్యుత్ సంస్థల పురోగతికి, ప్రజలకు మేరుగైన సేవలు అందించడానికి అనుగుణంగా సహకారం అందించారన్నారు.తనకు ఘనంగా విడ్కోలు పలికిన విద్యుత్ సంస్థల అధికారులు, ఉద్యోగులకు అజయ్ మిశ్రా ధన్యవాదాలు తెలిపారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్ లో చివరి మూడేళ్ల పాటు ఇందన శాఖ కార్యదర్శిగా పని చేయడం గొప్ప అవకాశం అన్నారు. తన కెరీర్ అంత ఎంతో సంతృప్తిగా, సంతోషంగా సాగిందన్నారు.

తన ఉద్యోగ జీవితంలో 25 శాఖ లు నిర్వహించానని అందులో ఎక్కువ కాలం పనిచేసింది ఎక్కువ సంతృప్తి కలిగించింది విద్యుత్ శాఖే అని చెప్పారు. ప్రభాకర్ రావు నుండి మోదలుకొని విద్యుత్ సంస్థల బాధ్యులంతా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అభినందించార. ఈ కార్యక్రమంలో ఎన్ పిడిసిఎల్ సిఎండి గోపాల రావు, ఎస్ పిడిసిఎల్ సిండి రఘుమారెడ్డి, ట్రాన్స్ కో జెఎండి శ్రీనివాస రావు, డైరెక్టర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.