నిమ్స్‌కు వెంటిలేటర్స్ అందచేసిన ట్రాన్స్‌కో,జెన్‌కో

44
prabhakar

నిమ్స్ హాస్పిటల్ కు సీఎస్ఆర్ ఫండ్ కింద 10 వెంటిలేటర్స్ అందజేశారు ట్రాన్స్ కో జెన్కో సంస్థ సీఎండీ ప్రభకార్ రావు. ఈ కార్యక్రమంలో నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ కె.మనోహర్ ,సూపరింటెండెంట్ మహేందర్ ,డైరెక్టర్, ఎస్ఈ టెక్నీకల్ హనుమ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ,కె మనోహర్ మాట్లాడుతూ వారం రోజులక్రితం నిమ్స్ లో 500 ప్రత్యేక పడకలు ఏర్పాటుచేసింది…అడగగానే…10 వెంటిలేటర్స్ కు సంబంధించిన నిధులు ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకరరావు అందజేశారని తెలిపారు. సుమారు 10 వెంటిలేటర్ లకు 70లక్షల నిధులు అందించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

త్వరలోనే 10 వెంటిలేటర్ లు నిమ్స్ లో అందుబాటులోకి రానున్నాయని…. వీటిని సీఎండీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం అన్నారు. నిమ్స్ హాస్పిటల్ లో సీఎస్ఆర్ ఫండ్ కింద 10 వెంటిలేటర్ లకు 70 లక్షల రూపాయల చెక్ అందించినందుకు సంతోషంగా ఉందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. కరోనా కట్టడికి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారు వారి సేవలు అభినందనీయం అన్నారు.

కరోనా రెండో దశలో సుమారు 3వేల మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు..సుమారు 80 మంది మరణించారని చెప్పారు. తొందరలోనే సిబ్బందికి వ్యాక్సిన్ అందజేస్తాం…ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళాం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరా కు అంతరాయం కలగకుండా సరఫరా చేస్తున్నారు….మా సిబ్బంది నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు మా సిబ్బంది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పని చేస్తున్నారని వెల్లడించారు.