3 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యం: వనజీవి రామయ్య

131
harish rao

భవిష్యత్‌లో 3 కోట్ల మొక్కలను నాటడమే తన లక్ష్యమపి తెలిపారు పద్మ శ్రీ వనజీవి రామయ్య. సిద్దిపేట జిల్లా అడవుల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో వచ్చిన వనజీవి దంపతులతో అల్పహారం చేసిన హరీష్‌….యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఎన్ని సంవ‌త్స‌రాల నుంచి మొక్క‌లు నాటుతున్నారని హరీష్‌ని అడిగి తెలుసుకున్నారు. త‌న ఐదో ఏటా నుంచే వ‌నం అంటే ఇష్ట‌ప‌డేవాడిని. మాన‌వ మ‌నుగ‌డ‌కు చెట్లే కీల‌కం కాబ‌ట్టి.. అప్ప‌ట్నుంచి మొక్క‌లు నాటుతున్ననని బదులిచ్చారు రామయ్య.

గతంలో వ్యవసాయం చేశానని నష్టం రావడంతో వదిలేశానని తెలిపారు. తన కుమారుడు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.క‌న్న‌త‌ల్లి లాంటి చెట్టును కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు.

రామయ్య జీవితం అందరికి ఆదర్శమని… మొక్క‌ల‌పై ఆయ‌నుకున్న మ‌క్కువ‌, వాటిని ఎలా పెంచుతున్నార‌నేది ప్రజాప్రతినిధులు తెలుసుకోవాలని హరీష్ సూచించారు.