రైజ్ ఆఫ్ సిరిసిల్ల డాక్యుమెంటరీ రిలీజ్…

63
uppala srinivas

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ,ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ నిర్మాతగా రూపొందిన రైజ్ ఆఫ్ సిరిసిల్ల అనే డాక్యుమెంటరీని మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ఈరోజు తెలంగాణ భవన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , మహబూబాద్ ఎంపీ కవిత , పార్టీ ఎమ్మెల్యేలు, డాక్యుమెంటరీ డైరెక్టర్ పూర్ణ చందర్ మరియు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, కేటీఆర్ అన్నిరంగాల్లో సిరిసిల్లను ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని వివరిస్తూ ఉప్పల శ్రీనివాస్ నేతృత్వంలో డైరెక్టర్ పూర్ణ చందర్ ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించారు.