హస్తినలో సీఎం కేసీఆర్…ప్రధానితో భేటీ

64
kcr
- Advertisement -

ఢిల్లీ పర్యటలో భాగంగా ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు సీఎం కేసీఆర్. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వానాకాలంలో పండిన పంటలో 90 శాతం వరి ధాన్యం సేకరణ,వచ్చే యాసంగిలో వరిధాన్యం కోనుగోలుపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేయనున్నారు.

కృష్ణ, గోదావరి నదుల్లో తెలంగాణ నీటి వాటా, రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లపై కేంద్రంతో చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ పర్యటనలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులున్నారు.

- Advertisement -