చిత్తుగా ఓడిన కివీస్…భారత్ సిరీస్ క్లీన్‌స్వీప్

77
rohith

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది భారత్‌. మూడో టీ20లో సైతం న్యూజిలాండ్ ఓడిపోవడంతో సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. భారత్ విధించిన 185 పరుగుల లక్ష్యచేధనలో న్యూజిలాండ్ కేవలం 17.2 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 73 పరుగుల తేడాతో విజయాన్ని నమోదుచేసింది. గప్టిల్ ఒక్కడే (51) పరుగులతో రాణించాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభం నుండే ధాటిగా ఆడింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ (31 బంతు ల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) మెరుపు ఆరంభాన్నివ్వగా.. చివరి ఓవర్‌లో దీపక్‌ చాహర్‌ (8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 21 నాటౌట్‌) విధ్వంసం సృష్టించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అక్షర్‌ పటేల్‌ (3-0-9-3) కు దక్కగా రోహిత్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు.