ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీర్‌..

35

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో సీఎం కేసీఆర్ త‌న బృందంతో ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 25న‌ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కేసీఆర్ స‌మావేశం కానున్నారు. 26న విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.