సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్యెల్యేలు..

25
MLA Kranthi Kiran

సంగమేశ్వర బసవేశ్వరకు ఆమోదం తెలిపి పరిపాలన అనుమతులు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు జిల్లా ఎమ్యెల్యేలు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిష రావు నేతృత్వంలో ఆందోల్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి, మరియు జహీరాబాద్ ఎమ్యెల్యే మాణిక్ రావు లు ఈరోజు శాసన సభలో ముఖ్యమంత్రిని కలిశారు. ఎన్నో ఏండ్లుగా వివక్షకు గురైన ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు కేసీఆర్ చొరవతో సస్యశామలంగా మారనున్నయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కొన్ని వేల ఎకరాలు సాగు నీరు అందించే కార్యక్రమంలో భాగస్వాములవుతున్నందుకు ఎమ్యెల్యే లను ముఖ్యమంత్రి అభినందించారు. “పనులను త్వరలోనే మొదలు పెడుదాం… మొదలు పెట్టాక తొందరగా పూర్తి అయ్యేటట్టు చూస్కోవాల్నిన బాధ్యత మీదే” అని సీఎం కేసీఆర్ ఎమ్యెల్యేలను ఉద్దేశించి అన్నారు. ” హరీష్‌కు ఉన్న అనుభవాన్ని వాడుకోండి.. ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ పనులు పూర్తి చెసుకోవాలని, దగ్గరుండి పనులు పూర్తి చేయించే బాధ్యత హరీష్ దేనని” ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు చెప్పిన అనంతరం ఆందోల్ ప్రజల చిరకాల స్వప్నం సాగునీటిని అందించడంలో నీవు భాగస్వామ్యమైనందుకు దన్యుడవు … అందోల్ ప్రజల ఆదరణ ఎల్లకాలం నీకు వుంటుంది” అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ భుజం తట్టారు.