తాప్పీపై నెటిజన్స్‌ షాకింగ్ కామెంట్స్‌..!

28

బాలీవుడ్ హీరోయిన్‌ తాప్సీ పొన్ను నటించిన ‘రష్మీ రాకెట్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.. అయితే, ఈ సారి నేరుగా ఓటీటీకి వచ్చేస్తోంది ఈ మద్దుగుమ్మ.. ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కి సర్వం సిద్ధమైంది. స్పోర్ట్స్ డ్రామాగా జనం ముందుకొస్తోన్న ఈ సినిమాపై అప్పుడే ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ కూడా ఊపందుకుంది. ముఖ్యంగా, తాప్సీ న్యూ లుక్ కొందరి కామెంట్లకు కారణం అవుతోంది. అథ్లెట్‌గా కనిపించేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది. వ్యాయామాలు చేసి సూపర్ ఫిట్‌గా మారింది. కానీ, ఇప్పుడు అదే కొందరి కామెడీలకు కారణం అవుతోంది.

ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదల అయింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు ‘మగాడిలా ఉన్నావ్’ అంటూ తాప్సీని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె శరీరాకృతి గురించి వెటకారంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాప్సీ ధీటుగా స్పందించింది. తాగాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌పై ఆమె స్పందిస్తూ… ఇలాంటి ట్రోలింగ్స్‌ను తాను కాంప్లిమెంట్స్‌గా తీసుకుంటానని చెప్పింది. తాను ఎంతో చెమటోడ్చి, వ్యాయామాలు చేసి అథ్లెట్ లుక్‌ను సాధించానని తెలిపింది. తన బాడీని చూసి మగాడివంటూ కామెంట్లు చేయడం తనకు ఒక ప్రశంస వంటిదేనని చెప్పింది.

Rashmi Rocket | Official Trailer | A ZEE5 Original Film | Premieres 15th Oct 2021 on ZEE5